వలస కూలీలవి మరణాలు కాదు.. హత్యలు: నారాయణ

by Shyam |
వలస కూలీలవి మరణాలు కాదు.. హత్యలు: నారాయణ
X

దిశ, న్యూస్‌బ్యూరో: వలస కూలీలవి మాములు మరణాలు కాదని, అవి ప్రభుత్వ హత్యలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో కాలి నడకన వెళ్తూ దారిలోనే కూలీలు మరణించారన్నారు. బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లాన్‌డౌన్‌లో వలస కార్మికులను ఆదుకోవడం, వారిని స్వస్థలాలకు చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు.. మంగళవారం హైదరాబాద్‌లోని ముగ్ధూం భవన్‌లో నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కరోనాను అడ్డు పెట్టుకొని రక్షణ రంగం, బొగ్గు, ఇస్రో, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. డెకాయిట్‌లకు మోడీ ప్రభుత్వానికి తేడాలేదని ఎద్దేవా చేశారు. ప్రైవేటీకరణ చేయాలనుకుంటే పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించాలని సూచించారు. ప్రతి వలస కార్మిక కుటుంబానికి రూ.10 వేలు, 20కిలోల బియ్యం ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story