ఇప్పుడే కేసీఆర్ రంగు బయటపడుతోంది

by Sridhar Babu |   ( Updated:2020-08-23 10:07:28.0  )
ఇప్పుడే కేసీఆర్ రంగు బయటపడుతోంది
X

దిశ, మధిర: రైతుల ప్రభుత్వమని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రగల్బాలు పలికే సీఎం కేసీఆర్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా, బోనకల్ మండలంలోని పలు గ్రామాల్లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఒక వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, తీవ్రంగా వర్షాలు చేరి రైతులను నిలువునా ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనునిత్యం రైతు ప్రభుత్వం అని, మేమే రైతుబంధు ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ రైతుల్ని ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. నష్టపోయిన పత్తి రైతులకు ఎకరానికి రూ. 40 వేలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులను వెంటనే ఫీల్డ్ మీదికి పంపించి పంట ఎంత మేరకు నష్టపోయిందో అంచనా వేసి, నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed