పోలీసులకు క్లీన్ చిట్ ఇవ్వడం బరితెగింపే

by Sridhar Babu |
పోలీసులకు క్లీన్ చిట్ ఇవ్వడం బరితెగింపే
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:
గ్యాంగ్ స్టర్ నయీం కేసులో 25 మంది పోలీసు అధికారులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. కరీంనగర్‌లో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడుతూ… పోలీసు అధికారుల ప్రమేయం ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇప్పటికే నయీం గ్యాంగ్ పై కేసు ఉందన్నారు. నయీం డైరీలోని విషయాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. డైరీలోని విషయాలను బయటపెడితే రాజకీయనాయకుల, అధికారుల బండారం అంతా బయటపడుతుందని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. తప్పు చేసిన వారు ఏ స్థాయిలో ఉన్నా కఠినంగా వ్యవహరిస్తామనీ సీఎం కేసీఆర్ అన్నారనీ తెలిపారు. కానీ నయీం కేసు విషయంలో వెనకడుగు ఎందుకు వేస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. దొంగలను దాచే ప్రయత్నంలో భాగంగానే కేసులను ఎత్తివేస్తున్నారని, న్యాయ విచారణ జరపాలని కోరారు. పోలీసులపై పోలీసు అధికారులే విచారణ జరపుతున్నారనీ, దీనివల్ల దోషులకు లాభం చేకూరుతున్నదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని సీపీఐ స్వాగతిస్తోందని అన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసే ప్రక్రియకు బ్రేకు వేయాలని కోరారు.

Advertisement

Next Story