- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోడు రైతులకు పట్టాలివ్వాలి: చాడ వెంకటరెడ్డి
దిశ, న్యూస్‌బ్యూరో: అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీ, గిరిజనుల భూములకు పట్టాలివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పోడు భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి నర్సింగరావు, కె గోవర్థన్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురువారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ పోడు భూముల సమస్యలను కుర్చీ వేసుకోని కుర్చోని పరిష్కరిస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆరేండ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా పోడు భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, గత నాలుగేళ్ల నుంచి ఆదివాసీలు, గిరిజనులను ప్రభుత్వాధికారులు, పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పోడు భూముల చుట్టూ కందకాలు తవ్వడంతో మనుషులు, పశువులు పడి చనిపోయిన ఉదంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ భూములు మావేనంటూ ప్రభుత్వం ఇచ్చిన పట్టా కాగితాలను చూపినా అధికారులు వినిపించుకోవడం లేదన్నారు. పోడు వ్యవసాయదారులకు రక్షణ కల్పించడమే గాకుండా, వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.