ఫామ్‌హౌస్‌పై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలి: చాడ

by Shyam |
ఫామ్‌హౌస్‌పై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలి: చాడ
X

దిశ, న్యూస్‌బ్యూరో: జన్వాడ ప్రాంతంలోని జీవో నెంబర్ 111 పరిధిలో గల ఫామ్‌హౌస్‌పై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కేటీఆర్ అక్రమంగా ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని ఫిర్యాదులు రావడంతో ఎన్జీటీ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. అయితే ఆ ఫామ్‌హౌస్ తనది కాదని కేటీఆర్ బహిరంగంగానే చెప్పడం చర్చనీయాంశం అయ్యిందని, అయితే అందులోకి కేటీఆర్ ఎందుకు వెళ్తున్నారనేది ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. ఫామ్‌హౌస్ అంశంపై వస్తున్న ఆరోపణలు నిజామా కాదా అన్న విషయాన్ని పూర్తిగా తేల్చాల్సిన బాధ్యత మున్సిపల్ మంత్రిగా కేటీఆర్‌పై ఉందని గుర్తు చేశారు.

Advertisement

Next Story