- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హీరో రామ్‌పై విజయవాడ సీపీ సీరియస్..
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని విజయవాడలో జరిగిన స్వర్ణా ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. ఆ ఘటనలో టాలీవుడ్ హీరో రామ్ పేరు ఈ మధ్య వరుసగా వినిపిస్తోంది. అయితే, స్వర్ణా ప్యాలెస్ ఘటనపై తాజాగా రామ్ పెట్టిన వరుస ట్వీట్లు చేశాడు. ఆ ట్వీట్లపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఎవరో ఏదో కామెంట్ చేస్తే తాను స్పందించనని.. విచారణ ఎలా జరపాలో తమకు తెలుసునని’ ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసులకు కులం, మతం ఉండదు. తమకు అందరూ సమానమే. మరీ ముఖ్యంగా పోలీసులకు రాజకీయ పార్టీలు, మతాలు అనేవి ఉండవు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికేవారు. ఆ ఆస్పత్రి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా వ్యవహరించింది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించాం. మాకు సందేహం ఉన్న అందరికీ నోటీసులు అందించాం. స్వర్ణ ప్యాలెస్‌లో క్వారంటైన్ సెంటర్ పేరుతో కాకుండా.. కొవిడ్ కేర్ సెంటర్ పేరిట నడిపారు. రమేష్ ఆస్పత్రిలో బోర్డు నిర్ణయాలు కూడా చేస్తుంది. ఆ కాపీలు తమకు అందితే ఆయా వ్యక్తులను కూడా పూర్తిగా విచారిస్తాం’ అని సీపీ వెల్లడించారు.