- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు :సీపీ
దిశ, క్రైమ్ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నగరంలో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ)లను రంగంలోకి దిగినట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అత్తాపూర్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. స్వస్తిక్ సింబల్ గురించి హైకోర్టు ఆదేశాలను జీహెచ్ఎంసీ కమిషనర్ రిటర్నింగ్ అధికారికి తెలియజేశారన్నారు. సైబరాబాద్ వ్యాప్తంగా 7 వేల మందితో పోలీసుల బందోబస్తు చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో పికెట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్, జగద్గరిగుట్ట, జీడిమెట్ల, సనత్ నగర్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్ పల్లి తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్, బ్లూ క్లోట్స్, ఎస్ఓటీ టీంలను ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం, ర్యాలీలు నిర్వహించడంపై నిషేధం ఉందని చెప్పారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు, పోస్టులు పెట్టకూడదని హెచ్చరించారు.