నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి : సజ్జనార్

by Shyam |
నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి : సజ్జనార్
X

దిశ, క్రైమ్ బ్యూరో: నిరంతరం నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావడానికి యాన్యువల్ మొబిలైజేషన్ పరేడ్ ఎంతగానో దోహదపడుతోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఏఆర్ సిబ్బంది ఒక ఏఆర్ విధులను మాత్రమే కాకుండా, ఎస్ఓటీ, షీ టీమ్స్, ఐటీ సెల్, స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్, ప్రిజనర్ ఎస్కార్ట్స్ తదితర పనులతో పాటు అనేక విధులను చేపడుతున్న వారి పనితీరు శ్లాఘనీయమన్నారు. సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆర్మ్డ్ రిజర్వ్ యాన్యువల్ మొబిలైజేషన్-2021 పరేడ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో పాల్గొన్న సీపీ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది క్రమశిక్షణతో పాటు ట్రైనింగ్‌లో కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. గణేశ్ బందోబస్త్, పండుగలు, నూతన సంవత్సర వేడుకల రోజు, అసెంబ్లీ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు, వరదలు, కరోనా సమయాల్లో ఏఆర్ సిబ్బంది బాగా పని చేశారన్నారు. ఏఆర్ సిబ్బంది ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలన్నారు. ఏడీసీపీ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్‌ను, ఏఆర్ సిబ్బందిని సీపీ అభినందించారు. ఈ సందర్భంగా ఏఆర్ పరేడ్‌లో సీపీ సజ్జనార్ గౌరవ వందనం స్వీకరించారు.

Advertisement

Next Story