సాయం కోసం ట్విట్టర్‌లో యువతి పోస్ట్.. సీపీ రవీందర్ స్పందన

by Shyam |
సాయం కోసం ట్విట్టర్‌లో యువతి పోస్ట్.. సీపీ రవీందర్ స్పందన
X

దిశ, వరంగల్: లాక్‌డౌన్ నేపథ్యంలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు సాయం చేయాలని కోరుతూ ఓ యువతి ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌పై వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ స్పందించి సాయం అందించారు. కాజీపేట జూబ్లీ మార్కెట్‌‌‌లో ఇమ్మడి నీలిమా కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. లాక్‌డౌన్ కారణంతో తన తల్లిదండ్రులు ఉపాధి కోల్పోయారని, దీంతో ఇల్లు గడవటం కష్టంగా మారిందని మంత్రి కేటీఆర్, వరంగల్ సీపీ రవీందర్‌కు ట్విట్టర్‌ ద్వారా విన్నవించుకుంది. స్పందించిన సీపీ సదరు కుటుంబానికి సాయం అందించాలని కాజీపేట పోలీసులను ఆదేశించారు. కాజీపేట ఇన్‌స్పెక్టర్ రావుల నరేందర్, ఎస్ఐ అశోక్ కుమార్ నీలిమా కుటుంబానికి నిత్యావసర వస్తువులతోపాటు కూరగాయలు అందజేశారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన పోలీసులకు, వరంగల్ సీపీ, మంత్రి కేటీఆర్‌కు నీలిమా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

tags : twitter post, cp ravinder response, warangal, necessities supply

Advertisement

Next Story