కరోనా నమూనా ఆవిష్కరణ

by Shyam |
కరోనా నమూనా ఆవిష్కరణ
X

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా, ప్రజలెవరూ బయటకు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ భీమరాజు తయారు చేసిన కరోనా నమూనా చిత్ర పటాన్ని ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆవిష్కరించారు. మంగళవారం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ చిత్ర నమూనా ఎలా ఉంటుందనేది అందరూ గుర్తించేలా దీనిని ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో ఈ వైరస్ దెబ్బకు చాలా మంది చనిపోతున్నందున అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బైక్ పై ఒక్కరూ, కారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించాలన్నారు. అది కూడా వారు ఉండే ప్రదేశం నుంచి 3కిలోమీటర్ల పరిధిలోనే అని తేల్చారు. అలాగే రేషన్ షాపులు, కూరగాయల మార్కెట్ వద్ద 3మీటర్ల సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. మాస్కులు ధరించి, శానిటైజరు తప్పకుండా వాడాలన్నారు.చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. సాయంత్రం 6 తర్వాతమెడికల్ షాప్‌లు తప్ప కిరాణా షాప్స్, మార్కెట్లు బంద్ చేయాలని ఆదేశించారు. లాక్ డౌన్‌ను అందరూ పాటించి, కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించాలని సూచించారు. కరోనా సమాచారం కోసం రాచకొండ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, వివరాలకు 9490617234 నెంబర్ కి సమాచారమివ్వాలన్నారు. కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్, మల్కాజిగిరి ఏసీపీ నర్సింహ రెడ్డి, ఆర్టిస్ట్ భీమా రాజు, రాచకొండ పొలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువులు అందజేత..

బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి గౌతమ్ నగర్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు జాయ్ ఆఫ్ షేరింగ్ సోసైటీ సహకారంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామెల బుచ్చిరెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ నర్సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, namunaa launch, hyd, uppal, rachakonda cp mahesh bagavath

Advertisement

Next Story

Most Viewed