మేము లాఠీలెత్తలేదు: సీపీ ద్వారకా తిరుమలరావు

by srinivas |
మేము లాఠీలెత్తలేదు: సీపీ ద్వారకా తిరుమలరావు
X

దిశ, ఏపీ బ్యూరో: పటమటలో వలస కార్మికులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారన్న ఆరోపణలపై నగర సీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఆయన.. వలస కూలీలకు పోలీసుల తరుపున అండగా నిలుస్తున్నాము. వారికి పోలీస్‌ శాఖ తరపున మాస్క్‌లను, శానిటైజర్‌లను, చెప్పులు, పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నామన్నారు. వలస కూలీల కోసం కమిషనరేట్‌ పరిధిలో మూడు సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు సీపీ చెప్పారు.

పటమటలో పశ్చిమబెంగాల్‌కు చెందిన కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు రిజిష్టర్‌ చేసుకున్నారు. అక్కడ కార్మికులను కొందరు కావాలనే రెచ్చగొట్టారు. వారికి తగిలిన దెబ్బలు కొట్టినవి కావు. మేము లాఠీలను వాడలేదని’ సీపీ వివరణ ఇచ్చారు. రాజకీయ పక్షాలు లాక్‌డౌన్‌ సమయాన్ని‌ పాటించాలని కోరారు. పాటించకపోతే చట్ట పరిధిలో సమాధానం చెప్పడం మాకు తెలుసని సీపీ హెచ్చరించారు. చట్ట పరంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరుస్తాము. కొత్త సడలింపుల ప్రకారం చట్టపరంగానే ముందుకు వెళ్లనున్నట్టూ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed