- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లెక్కకు మించిన ఆన్‌లైన్ మోసం.. రూ.320కోట్లు ఫ్రీజ్
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ యాప్ మోసాలు పెరిగిపోతున్నాయి. వీటి నుంచి రుణం పొందిన వ్యక్తులు అప్పు తీర్చలేక, యాప్ సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. తీసుకున్న మనీ కంటే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ చైనా ఆన్‌లైన్ లోన్ యాప్స్‌పై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొన్ని యాప్స్‌పై కేసులు నమోదు కాగా, తెలంగాణ ఐటీ సెల్ విభాగం ఆ లోన్ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించాలని గూగుల్ కంపెనీకి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఆన్‌లైన్ లోన్ యాప్స్ నిర్వహకులు చైనా దేశానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు 9 రాష్ట్రాల్లో పోలీసులు లోన్‌యాప్ నిర్వహకులపై దాడులు చేశారు. ఇప్పటివరకు నిందితుల బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.320 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా లోన్‌యాప్ బాధితులు పెరిగిపోతుండటంతో ఇతర రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ పోలీసుల నుంచి సమాచారం తీసుకుని ఆయా రాష్ట్రాల్లోని పలువురు నిందితులపై కేసులు నమోదు చేశారు. కాగా, ఇప్పటివరకు 20 మంది నిందితులను చైనా లోన్‌యాప్ మోసం కేసులో అరెస్టు చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా ఈ యాప్స్ వలన మోసపోయిన వారి సంఖ్య భారీగా ఉండే అవకాశం లేకపోలేదని సీపీ వెల్లడించారు.