Breaking: శ్రీవారి టోకెన్ల జారీలో తొక్కిసలాట.. మహిళా భక్తురాలు మృతి

by srinivas |   ( Updated:2025-01-08 16:37:49.0  )
Breaking: శ్రీవారి టోకెన్ల జారీలో తొక్కిసలాట.. మహిళా భక్తురాలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల(Srivari Vaikuntha Darshans)కు ముందే తిరుపతి(Tiruapti)లో అపశ్రుతి చోటు చేసుకుంది. దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట(Stampede)లో మహిళ మృతి చెందారు. తమిళనాడు(Tamilanadu) సేలంకు చెందిన మహిళ.. తిరుపతి విష్ణు నివాసం(Vishnu Nivasam) వద్ద టోకెన్లు తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో భక్తురాలు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో రుయా ఆస్పత్రి(Ruya Hospital)కి తరలించారు. అయితే మహిళ మృతి చెందడంపై టీటీడీ(TTD) స్పందించింది. బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ దర్శనాల్లో పాల్గొనే భక్తులకు టోకెన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. తిరుపతిలో 9 కేంద్రాలు ఏర్పాటు చేసి తెల్లవారుజాము నుంచి టికెన్లు జారీ చేసేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ టోకెన్లు పొందేందుకు ఈ సాయంత్రం నుంచి భారీగా తరలివచ్చారు. విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలోని క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. దీంతో మహిళ మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed