నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

by Shyam |
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
X

దిశ, కంటోన్మెంట్:
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని నగర పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా ఏర్పాటు చేసిన 200 సీసీ కెమెరాలను నార్త్ జోన్ అదనపు డీసీపీ శ్రీనివాస్ తో కలిసి సీపీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ… సీసీ కెమెరాల పుటేజీల వల్ల కీలకమైన కేసుల్లో ఆధారాలను త్వరితగతిన సేకరిస్తునట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే హైదరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని తెలిపారు. నగర భద్రతపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రూ.20 లక్షల వ్యయంతో 200 ల సీసీ కెమెరాలను కార్ఖానా పీఎస్ పరిధిలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు.

Advertisement

Next Story

Most Viewed