Cow cuddling in America: ఆవు కౌగిలింతకు క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాక్..?

by Anukaran |   ( Updated:2021-05-24 01:56:58.0  )
Cow cuddling in America: ఆవు కౌగిలింతకు క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాక్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం టెక్నాలజీ తో ఎంత ముందుకి వెళ్తున్నా కొన్ని మూఢనమ్మకాలను ప్రజలను నమ్ముతూ ఉంటారు. అయితే వాటిలో కొంత సైన్స్ కలగలిపి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతుంటారు. అయితే కొన్ని విషయాల్లో ఏది మూఢనమ్మకం.. ఏది సైన్స్ ? అనేది నమ్మడం కొంచెం కష్టమే.. తాజాగా మనం మాట్లాడుకుంటున్న ఒక విషయం కూడా మూఢనమ్మకమా..? సైన్సా ..? అనేది తెలియడం కష్టమే.

ప్రస్తుతం అన్ని దేశాలు కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడినవారు ఎక్కువగా శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకు అమెరికాలో ఓ కొత్త పద్దతిని అమలులోకి తెచ్చారు. అయితే అది నమ్మినవారికి మాత్రమే.. సాధారణంగా మన దేశంలో ఆవును గోమాతగా పూజిస్తారు. అంతేకాకుండా గోమాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే అమెరికాలో ఆవును కౌగిలించుకుంటే సకల రోగాలు నయమవుతాయని నమ్మకమంట.. అందుకే ప్రస్తుతం ఆవు కౌగిలింత( cow cuddling) అనేది ఫేమస్ గా మారిపోయింది.

మన దేశంలో ఆవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఖర్చు కాదు. కానీ ఆ దేశంలో మాత్రం ఆవు కౌగిలింత చాలా ఖరీదు సుమా.. ఒక్క గంట ఆవు కౌగిలింతకు ఏకంగా 75 డాలర్లు చెల్లించాలి. అంటే మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు రూ. 5,500. ఇక ఆవును కౌగిలించుకోవడం వలన ద్వారా శ్వాసకోశ వ్యాధులు రక్తపోటు వెన్నెముక నొప్పి గుండె సమస్యలతో పాటు.. డిప్రెషన్ మానసిక సమస్యలు విచారం ఆందోళన వంటి సమస్యలు కూడా తొలగిపోతాయని డాక్టర్లు చెబుతున్నారు. తల్లి దగ్గర ఉండే హృదయ స్పందన ఆవు దగ్గర ఉంటుందంట.. ఆవు దగ్గర ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అమెరికన్లు తెలుపుతున్నారు.

ఇక ఈ విషయం తెలుసుకొన్న అమెరికన్లు ఆవు కౌగిలింతకు క్యూ కడుతున్నారట. అయితే ఇది మూఢనమ్మకం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఆవును హాగ్ చేసుకొంటే సమస్యలు తొలగిపోతాయా.. ఇంకా ఏ కాలంలో ఉన్నారంటూ తీసిపారేస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు సైతం ఆవును ని హగ్ చేసుకోవడం వలన మనిషి రిలాక్స్ అవుతాడని, ఇదో మంచి పద్దతని తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed