డోర్​ టూ డోర్​ ప్రచారం.. నో మాస్క్​… నో ఓట్​

by Shyam |
డోర్​ టూ డోర్​ ప్రచారం.. నో మాస్క్​… నో ఓట్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకెండ్​ వేవ్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రచారానికి నిబంధనలను విధిస్తూ ఎస్​ఈసీ ఆదేశాలిచ్చింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికలతో పాటుగా జీహెచ్​ఎంసీ 18వ డివిజన్​, మరో 8 మున్సిపాలిటీల్లో 8 వార్డులకు నిర్వహిస్తున్న ఉప ఎన్నికల్లో కొవిడ్​ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రచార బృందంలో అభ్యర్థితో సహా ఐదుగురు మాత్రమే ఉండాలని, ఐదుగురికి మించి ఉండకూడదని సూచించారు. డోర్​ టూ డోర్​ ప్రచారానికి ఐదుగురు మాత్రమే వెళ్లాలని, ఇంటి బయట నుంచే ప్రచారం చేసుకోవాలని, గుంపుగా ఇండ్లలోకి వెళ్లరాదని ఆంక్షలు విధించారు. అదే విధంగా ప్రతి అభ్యర్థి రెండు వాహనాలను మాత్రమే వినియోగించాలని, వాహనాల్లో ఒక్కొక్కరికి 10 మీటర్ల గ్యాప్​ ఉండాలని, రోడ్​షోలను ఒక పార్టీ నిర్వహించిన అరగంటకు మరో పార్టీకి అవకాశం ఇవ్వాలని సూచించారు.

ఇక దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వారితో పాటుగా కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధారణ అయిన ఓటర్లకు పోస్టల్​ బ్యాలెట్​ అవకాశం కల్పించారు. అదే విధంగా పోలింగ్ కు ముందు రోజు కేంద్రాలను పూర్తిగా శానిటైజ్​ చేయాలని, పోలింగ్​ కేంద్రాల్లో సోషల్​ డిస్టెన్స్​ పాటించాలని, మాస్క్​ లేకుంటే ఓటర్లను పోలింగ్​ కేంద్రాల్లోకి రానీవ్వమంటూ ఎస్​ఈసీ హెచ్చరించింది. పోలింగ్​ కేంద్రాలకు రావడం, వెళ్లడం దారుల్లో శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్​ కేంద్రాల్లో అనువుగా ఉండే స్థలం ప్రకారం ఖచ్చితంగా 6 ఫీట్ల దూరం ఉండాలని, ఒకేసారి కేంద్రాల్లోకి 15 మంది కంటే ఎక్కువ అనుమతించరని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed