యాదాద్రి జెడ్పీ సీఈఓ, ఆయన భార్యకు పాజిటివ్

by vinod kumar |   ( Updated:2020-06-11 08:35:00.0  )
యాదాద్రి జెడ్పీ సీఈఓ, ఆయన భార్యకు పాజిటివ్
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వాసులను కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. జిల్లాను గ్రీన్​ జోన్​గా మార్చేందుకు సహకరించిన ఉన్నతాధికారులను కూడా భయపడుతోంది. జెడ్పీ సీఈవోతో పాటు ఆయన భార్యకూ కరోనా పాజిటివ్​గా తేలినట్టు జిల్లా యంత్రాంగం అధికారికంగా ధ్రువీకరించింది. తొలినాళ్లలో జిల్లాను కట్టుదిట్టం చేసి గ్రీన్​ జోన్​గా మార్చేందుకు దోహదపడిన ఉన్నతాధికారులే చివరకు… కరోనాతో బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారికి పాజిటివ్ అని తేలడంతో మిగతా అధికారులంతా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. జనతా కర్ఫ్యూ తర్వాత ఇంచుమించు రెండు నెలల వరకూ ఒక్క కేసు నమోదు కాని యాదాద్రిలో… గత కొద్దికాలంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. తాజాగా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారితోపాటు.. ఆయన సతీమణి వ్యాధి బారిన పడ్డారు. శనివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న సీఈవో, అవే లక్షణాలు తన సతీమణిలోనూ కనిపించడంతో కొవిడ్ పరీక్షల కోసం వైద్యాధికారులను సంప్రదించారు. బుధవారం రక్త నమూనాల్ని పంపగా… ఇవాళ పాజిటివ్ నిర్ధరణ అయినట్టు అధికారులు ధ్రువీకరించారు. దీంతో కలెక్టరేట్ సహా జెడ్పీ కార్యాలయాన్ని పారిశుధ్య సిబ్బంది శుద్ధి చేశారు.

Advertisement

Next Story

Most Viewed