కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు కరోనా

by vinod kumar |
కేంద్ర మంత్రి రాందాస్ అథవాలేకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కరోనా బారినపడ్డారు. నటి పాయల్ ఘోష్‌ను బహిరంగ వేడుకలో సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే)లోకి ఆహ్వానించిన గంటల వ్యవధిలో ఈ రిపోర్టు వెలువడటం గమనార్హం. ఈ వేడుక తర్వాత ఒళ్లు నొప్పులు, దగ్గు రావడంతో అథవాలే కరోనా టెస్టుకు నమూనాలు ఇచ్చారు.

ఈ టెస్టులో కరోనా పాజిటివ్ అని మంగళవారం తేలింది. దీంతో చికిత్స కోసం దక్షిణ ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో ఆయన చేరారు. అథవాలే డయాబెటిక్‌తో బాధపడుతున్న సన్నిహితులు తెలిపారు. సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ‘గో కరోనా, కరోనా గో’ అని పఠిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story