వెల్లుల్లి, టూత్ పేస్ట్.. ఏది ట్రై చేసినా నో టేస్ట్

by Shyam |   ( Updated:2020-11-17 03:26:36.0  )
వెల్లుల్లి, టూత్ పేస్ట్.. ఏది ట్రై చేసినా నో టేస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టి సరిగ్గా ఏడాది గడిచింది. కానీ ఇప్పటికీ ఆ వైరస్ ప్రపంచాన్ని వీడిపోలేదు. ఇండియాలో ఇప్పటికీ కొత్త కేసులు నమోదవుతుండగా.. ఇతర దేశాల్లో మాత్రం కరోనా సెకండ్ వేవ్ కూడా ప్రారంభమైంది. కాగా, భారత్‌లో చాలా వరకు పాజిటివ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిందా? రాలేదా అని తెలుసుకునేందుకు అందరూ ఫాలో అవుతున్న సింపుల్ చిట్కా ఏంటంటే.. వాసన, రుచులను గుర్తించడం. ఏ కాస్త జ్వరం వచ్చినా, చలికి కొద్దిగా ముక్కు కారినా, గొంతులో నొప్పిగా అనిపించినా.. కరోనా వచ్చిందేమోనని భయపడుతున్నారు. అందుకే, అది ముందుగా కన్ఫార్మ్ చేసుకోవడానికి తమ టేస్ట్ బడ్స్‌కు పని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే న్యూజెర్సీకి చెందిన 30 ఏళ్ల రసెల్ డొనెల్లీ రా ఫుడ్ తిన్నాడు. ఆ ఫుడ్ వీడియో నెట్టింట్లో ఫుల్ వైరల్‌గా మారింది.

రుచి, వాసన కోల్పోవడం కరోనా ప్రధాన లక్షణం. న్యూజెర్సీకి చెందిన రసెల్‌‌కు కూడా కరోనా రావడంతో ఏ రుచి, వాసనలు పసిగట్టలేకపోయాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులకు చెబితే నమ్మలేదు. దాంతో వాళ్లను నమ్మించడానికి రసెల్ ఓ ప్రయోగం చేశాడు. అదేంటంటే.. పంజెంట్ స్మెల్‌ను అందించే పచ్చి ఉల్లిగడ్డను తిన్నాడు. ఘాటుగా ఉండే వెల్లుల్లి పేస్ట్‌ను ఆరగించాడు. నిమ్మర‌సం, ఆపిల్ సైడ్ వెనిగ‌ర్‌ను తాగాడు. టూత్‌పేస్ట్‌ కూడా తినేందుకు ప్రయ‌త్నించాడు. ఇలా ఎన్ని తింటున్నా గానీ ఏ రుచి ఏంటో తెలియడం లేదని, కరోనా చాలా వెరైటీ వైర‌స్ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రసెల్ సోషల్ మీడియాలో పంచుకోగా, అది కాస్త బాగా వైరల్ అయ్యింది. 17 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. కాగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 54 మిలియన్ల ప్రజలు కరోనా వైరస్ బారినపడ్డారు. 1 మిలియన్ ప్రజలు ఆ మహమ్మారి వల్ల చనిపోయారు.

Advertisement

Next Story