20 మంది కరోనా రోగులు పరార్

by vinod kumar |
20 మంది కరోనా రోగులు పరార్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంటే కొందరు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు ముందుగా ఆస్పత్రికి వెళ్లి టెస్టు చేయించుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా ఇతరుల లైఫ్‌ను రిస్కులో పెడుతున్నారు. తాజాగా కొవిడ్ పాజిటివ్ వచ్చిన కొందరు బాధ్యతా రహిత్యంగా ప్రవర్తించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఎవరికీ తెలియకుండా కొవిడ్ కేర్ సెంటర్ నుంచి పరారయ్యారు. ఈ ఘటన మహరాష్ట్రలోని యావత్ మాల్‌లో ఆదివారం వెలుగుచూసింది. విషయం తెలియడంతో జిల్లా కలెక్టర్ అమోల్ యెగ్డే వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన క్యాంపులో 20 మందికి టెస్టులు నిర్వహించగా అందులో 19 మందికి పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story