సంభాషణల ద్వారా కూడా కొవిడ్ -19 ?

by vinod kumar |
సంభాషణల ద్వారా కూడా కొవిడ్ -19 ?
X

తుమ్మినపుడు, దగ్గినపుడు విడుదలయ్యే తుంపర్లతోనే కాకుండా మాట్లాడేటపుడు బయటకి వచ్చే తుంపర్ల ద్వారా కూడా కొవిడ్ 19 వ్యాపిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. మొన్నటివరకు మాట్లాడటం వల్ల విడుదలయ్యే తుంపర్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదనే అనుకున్నారు. కానీ, అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌వారు చేసిన పరిశోధనలో ఇది తప్పని వెల్లడైంది. కొన్ని వాక్యాలను పదే పదే పలకడం ద్వారా ఉత్పత్తయ్యే తుంపర్లను అత్యంత సున్నితమైన లేజర్ లైట్ ద్వారా పరిశీలించి ఆ తుంపర్లను డేటా విజువలైజేషన్ ద్వారా విశ్లేషించారు. కంటికి కనిపించనంత చిన్న సైజులో ఈ తుంపర్లు ఉన్నప్పటికీ పాథోజెన్లకు వాహకాలుగా పనిచేయగల సామర్థ్యం వీటికి ఉందని తెలిసింది.

ఒక మిల్లీలీటర్ నోటి స్రావంలో 7 మిలియన్ల కొవిడ్ 19 కాపీలు ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. దీన్ని బట్టి చూస్తే కొవిడ్ 19 పాజిటివ్ పేషెంట్ నిమిషంపాటు మాట్లాడితే వైరస్‌తో కూడిన 1000 తుంపర్లు బయటికి వస్తాయి. వీటి వల్ల వైరస్ దాదాపు 8 నిమిషాల వరకు గాలిలో క్రియాశీలకంగా ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని తమ లేజర్ లైట్ స్కాటరింగ్ ద్వారా ప్రత్యక్షంగా చూసినట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చిన్న చిన్న మీటింగులు, సమావేశాల్లో కూడా సాధారణంగా మాట్లాడినప్పటికీ వైరస్ వ్యాపించే అవకాశం లేకపోలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed