ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

by srinivas |
AP corona Update
X

దిశ, ఏపీబ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 61,363 సాంపిల్స్ పరీక్షించగా 1,361మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,24,603కి చేరింది. అదే సమయంలో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 13,950కు పెరిగింది. గత 24 గంటల్లో 1,288 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,96,143కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,510 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,70,99,014 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story