కుమారుడే తండ్రికి అంటించాడు

by srinivas |
కుమారుడే తండ్రికి అంటించాడు
X

కన్న కొడుకే తండ్రి పాలిట మృత్యువయ్యాడు. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతాడనుకున్న కుమారుడు.. దేవుడి ప్రవచనాలతో పాటు కరోనా మహమ్మారిని కూడా వెంటబెట్టుకొచ్చాడు. షుగర్, గుండె సంబంధిత సమస్యలున్న 55 ఏళ్ల తండ్రికి కరోనాను అంటించి అతని ప్రాణాలు హరించిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ఏపీ నోడల్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం…

విజయవాడ శివారులోని కుమ్మరిపాలెంకి చెందిన వ్యక్తి మార్చి 30 సోమవారం నాడు ఉదయం 11.30 నిమిషాలకు జనరల్ ఆసుపత్రిలో జాయినై 12.30 నిమిషాలకు మృతి చెందాడు. ఆసుపత్రిలో చేరగానే అనుమానంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయన మృతి సాధారణంగా జరిగిందా? లేక కరోనా కారణంగా జరిగిందా? అన్న దానిని తేల్చడంలో జాప్యం జరిగింది. ఆయన మృతి చెందిన తరువాత ఆయనకు నిర్వహిచిన కరోనా పరీక్ష ఫలితాలు వచ్చాయి. ఇందులో ఆయనకు కరోనా సోకిందని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటీన ఆయన కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయన కుమారుడికి కరోనా ఉన్నట్టు నిర్ధారించారు. ఆయన నుంచే తండ్రికి సోకినట్టు గుర్తించారు. ఆ వ్యక్తి గత నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ మర్కత్‌కు హాజరైనట్టు గుర్తించారు. దీంతో అతనితో సంబంధాలు నెరపిన 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు పంపించారు. విజయవాడ మున్సిపల్ అధికారులు ఆ ఏరియాను లాక్ చేసి, హై అలెర్ట్ ప్రకటించారు.

కరోనా వాహకుడు ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నాడని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. సదరు వ్యక్తి ప్రయాణించిన విమానంలోని ప్రయాణీకులందర్నీ అప్రమత్తం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ఏపీ నోడల్ ఆఫీసర్ తెలిపారు.

Tags: corona virus, covid-19, vijayawada, kummaripalem, genaral hospital, man dead

Advertisement

Next Story

Most Viewed