- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరులో కొవిడ్-19 రిపోర్ట్స్ టెన్షన్
దిశ, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ (కొవిడ్-19) వల్ల ప్రస్తుతం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ మర్కజ్ ఘటన తర్వాత ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 35 మందికి కొవిడ్ పాజిటివ్ రాగా, ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతులిద్దరూ జోగుళాంబ గద్వాల ప్రాంతానికి చెందిన వారే కావడంతో నడిగడ్డ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు చెందిన మరి కొందరి శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. ప్రస్తుతం వాటి రిపోర్టులు ఇంకా అందలేదు. రిపోర్టుల్లో ఎంత మందికి కొవిడ్ 19 పాజిటివ్ వచ్చే పరిస్థితి ఉందో అని జిల్లావాసులు టెన్షన్ పడుతున్నారు.
అధికారుల లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మంది, గద్వాలకు చెందిన 23 మంది నాగర్ కర్నూల్‌కు చెందిన ఇద్దరు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకిన వారిలో 23రోజుల పసికందు(బాలుడు) ఉన్నాడు. బాలుడి తండ్రి నుంచే వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వం పలుమార్లు ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎంతగా చెప్పినా పట్టించుకోకపోవడం వల్లనే నేడు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వైరస్ సోకిన వారితో పాటు వారి కుటుంబీకులను అధికారులు ఐసొలేషన్ కేంద్రాలకు, క్వారంటైన్లకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా అధికారులు వైరస్ సోకిన వ్యక్తులకు సంబంధించిన ప్రాంతాలపై నిఘా ఉంచారు. ఎక్కడ అనుమానితులు కనిపించిన వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే, జిల్లా వ్యాప్తంగా గతంలో పంపిన వారి నమూనాలకు సంబంధించిన రిపోర్టులు రాకపోవడంతో జిల్లా అధికారులు, ప్రజల్లో కొంత టెన్షన్ ఉన్నది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి 34, నాగర్ కర్నూల్ జిల్లా నుంచి 41, జోగుళాంబ గద్వాల నుంచి 79 మంది శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. వీటిల్లో ఎంత మందికి కొవిడ్ 19 పాజిటివ్ వస్తుందనే అంశం కొంత వారిని కలవరపెడుతోంది. ఇదిలా ఉండగా బుధవారం మహబూబ్‌నగర్‌లో 40మంది, గద్వాలలో 56, నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరి శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. వారి రిపోర్టులూ రావాల్సి ఉంది.
Tags: covid 19, tension, lockdown, palamuru district, coronavirus