- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనాతో.. ఆ వ్యాక్సిన్ల సేవలూ బంద్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కొద్ది కొద్దిగా విస్తరిస్తున్న టైమ్‌లో అంతటా లాక్‌డౌన్‌లు విధించారు. కొవిడ్-19 నగరాల నుంచి గ్రామాలను చుట్టుముడుతున్న వేళ.. అన్నీ ఓపెన్ చేసేశారు. ఈ పరిస్థితుల్లో చాలా దేశాలతో పాటు మన దేశంలోనూ కరోనాను ఎదుర్కోవడం సవాల్‌గా పరిణమించింది. ఇదిలా ఉంటే.. మరోవైపు సీజనల్ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా ప్రపంచ దేశాలను కలవరపెడుతుండటం గమనార్హం.
వాతావరణంలో మార్పులొచ్చాయి. వర్షాలు కూడా మొదలయ్యాయి. ఇదే తరుణంలో మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో)తో పాటు యూనిసెఫ్ కూడా ఈ సీజన్‌లో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని మొదటి నుండే చెబుతున్నాయి. అనేక దేశాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ చిన్నారులను ఆస్పత్రులకు తీసుకొస్తే.. కరోనా ఎక్కడ అటాక్ అవుతుందోనని చాలా దేశాల్లో వ్యాక్సిన్ సేవలు కొనసాగించడం లేదు. దీంతో చాలావరకు దేశాల్లో వివిధ వ్యాధుల ప్రభావం కనిపిస్తోంది.
– పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌కు చెందిన చిన్నారుల్లో డిఫ్తిరియా లక్షణాలు కనిపిస్తున్నాయి.
– సౌత్ సూడాన్, కామెరూన్, మొజాంబిక్, యెమెన్, బంగ్లాదేశ్‌లో కలరా కేసులు వెలుగుచూస్తున్నాయి.
– ఇవే కాక 30 దేశాల్లో పోలియో వైరస్ కేసులు నమోదవుతున్నాయి.
బంగ్లాదేశ్, బ్రెజిల్, కాంబోడియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇరాక్, కజకిస్తాన్, నేపాల్, నైజీరియా, ఉజ్బెకిస్తాన్ దేశాల్లో ‘మీస్లెస్’ అనే వైరల్ డిసీజ్‌లు పెరిగిపోతున్నాయి. వైరస్ అటాక్ కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల స్కిన్ మంటెక్కిపోయి, ర్యాషెస్ వస్తుంటాయి. అయితే ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఉంది. కరోనా మహమ్మారి విజృంభణతో 29 దేశాలు మీస్లెస్ క్యాంపయిన్స్‌ను సస్పెండ్ చేశాయి. 2020లో ఇప్పటికే వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా.. ఆ క్యాంపెయిన్స్ రద్దు కావడంతో 178 మిలియన్ల పిల్లలు రిస్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.