- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా సోకిన యూత్‌కు బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమయంలో డాక్టర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. కొందరిలో లక్షణాలు కనిపిస్తున్నాయి, మరికొందరిలో లక్షణాలు అసలు ఏమాత్రం కనిపించడం లేదు. కరోనాను డీల్ చేయడం ఇటు డాక్టర్లకు, అటు సైంటిస్టులకు సవాల్‌గా మారింది. మొదట్లో యూత్‌పై కరోనా అంతగా ప్రభావం చూపదని వైద్యులు చెప్పడంతో.. అంతా తేలికగా తీసుకున్నారు. కానీ, అమెరికా, ఇటలీ, స్పెయిన్‌లలో యూత్ కూడా ఎక్కువగా కరోనా బారిన పడటంతో .. అంతా అప్రమత్తమయ్యారు. అయితే ఆ సమయంలోనే అమెరికాలోని మౌంట్ సినయ్‌లో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న డా.జె మొకొ మాట్లాడుతూ ‘ఇటీవల మా ఆసుపత్రికి బ్రెయిన్ స్ట్రోక్స్‌తో వచ్చేవాళ్ల సంఖ్య పెరిగింది. కోవిడ్ సోకిన కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతున్నారు. బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడం వల్లే ఇలా జరుగుతుంది. శరీరంలో వైరస్ ఎక్కడెక్కడ ఇలా క్లాట్స్ ఏర్పడేలా చేస్తుందో అంతుచిక్కడం లేదు. ఎక్కువ శాతం యువతీ యువకుల్లోనే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడు కోవిడ్-19 మొదటి లక్షణంగా బయటపడుతోంది’ అని తెలిపారు. తాజాగా కోవిడ్ 19 పేషేంట్స్ పై జరిగిన మరో పరిశోధన కూడా యూత్ లో బ్రెయిన్ స్టోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేల్చింది.
మార్చి – ఏప్రిల్ మధ్యలో కోవిడ్ సోకిన 14 మందిపై అమెరికాకు చెందిన థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఓ చిన్నపాటి పరిశోధన చేశారు. న్యూరో సర్జరీ జర్నల్ లో వాళ్లు చేసిన పరిశోధన గురువారం పబ్లిష్ అయ్యింది. ఆ పరిశోధన ప్రకారం.. యూత్ లో కరోనా లక్షణాలు కనిపించినా, కనిపించకపోయినా బ్రెయిన్ స్టోక్స్ వచ్చే ముప్పు అధికంగా ఉందన్నారు. కోవిడ్ 19 సోకిన 14 మందిలో స్టోక్స్ లక్షణాలను పరిశీలించామని, అది ప్రైమరీ రీసెర్చ్ మాత్రమేనని, మరింత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని పరిశోధకుడు పాస్కల్ అన్నారు. ‘14 మంది కోవిడ్ 19 బాధితుల్లో 8మంది పురుషులు, ఆరుగురు స్త్రీలు ఉన్నారు. స్టోక్స్ సింప్టమ్స్ ఉండటంతో మా వద్దకు వచ్చారు. అందులో చాలా మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తెలియదు. కొందరికీ లక్షణాలు ఉండటంతో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వారిలో చాలాచోట్ల రక్తం గడ్డకట్టి భారీ స్టోక్స్ కు కారణమయ్యాయి. 30 – 50 ఏళ్ల మధ్య వయసు వారిలో భారీ స్టోక్స్ కనిపించాయి. ఈ స్టోక్స్ ఎప్పటిలా సాధారణంగా లేవు’ అని పాస్కల్ పేర్కొన్నారు.