‘వచ్చే ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ క్షీణించవచ్చు ’

by Harish |
‘వచ్చే ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ క్షీణించవచ్చు ’
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 (Kovid-19), లాక్‌డౌన్‌ (Lockdown) లాంటి పరిస్థితులు సమాజానికి, ఆర్థిక వ్యవస్థ (Economy)కు శతాబ్దంలో ఒకసారి వచ్చే సంక్షోభానికి కారణమయ్యాయని, దీనివల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించవచ్చని హిందాల్కో ఇండస్ట్రీస్ ఛైర్మన్ (Hindalco Industries Chairman)కుమార్ మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు.

దేశీయ ఆర్థిక వ్యవస్థ (Domestic economy) ప్రపంచ అనిశ్చితి (Global uncertainty), ఒత్తిడి కారణంగా ఇదివరకే ప్రతికూలంగా ఉంది. అలాంటి సమయంలో కొవిడ్-19 (Kovid-19) రావడంతో ఆర్థిక వ్యవస్థ (economy) మరింత చిక్కుల్లో పడిందన్నారు.

‘భారత జీడీపీ (Indian GDP)లో ఎక్కువ భాగస్వామ్యం కలిగిన ప్రాంతాల్లోనే కరోనా అంక్షలు సుధీర్ఘ కాలం కొనసాగడంతో, అక్కడి ఆర్థిక వ్యవస్థలు (economy) తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితులను గమనిస్తే, రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ (Indian GDP) కుదించుకుపోయే అవకాశముందని కుమార్ మంగళం వాటాదారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్లడం కొంత కష్టమైనప్పటికీ ప్రయత్నించాలి. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి వారంలో కఠినమైన లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial year) తొలి త్రైమాసికం మొత్తం ప్రభావానికి గురైంది. అయితే, వాస్తవాలను పరిశీలిస్తే, సరైన నాయకత్వం, వ్యాపార ధోరణి, కష్ట సమయాల్లోనూ గెలిచిన ట్రాక్ రికార్డ్ (Track record)ఉన్న కంపెనీలు రానున్న కాలంలో ప్రపంచ ఛాంపియన్లు (World Champions)గా ఎదగనున్నాయని ఆయన తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక మాంద్యం (economic downturn), గతంలో ఉన్న మాంద్యాలకు భిన్నంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వాలు ప్రకటించిన సుమారు 9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపనలు, కేంద్ర బ్యాంకుల చర్యలతో ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు వీలుంది. అలాగే, ఈ ఉద్దీపనలతో డీఫాల్ట్, దివాళా లాంటి సెకండ్ ఆర్డర్ ప్రభావాలను పరిమితం చేసేందుకు తోడ్పడతాయని కుమార్ మంగళం బిర్లా వివరించారు.

Advertisement

Next Story