- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్స్‌క్లూజివ్ : నల్లగొండలో కంత్రి కపుల్.. ఉద్యోగాలిపిస్తామంటూ లక్షలు మింగారు..
దిశ, చండూరు : ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నెత్తిన కుచ్చుటోపి పెట్టి లక్షలకు లక్షలు వసూలు చేసిన ఓ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికిన ఓ జంట అమాయకులైన నిరుద్యోగుల నుండి లక్షలకు లక్షలు వసూలు చేశారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోయేసరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలంలోని తిరుగండ్లపల్లి గ్రామానికి చెందిన అయితేపాక రజినీకాంత్ ఫిర్యాదు మేరకు మర్రిగూడ ఎస్ఐ నాగుల్ మీరా కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన గాలిబ్, రమాదేవి ల జంట ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులతో ఆన్‌లైన్‌లో నమ్మబలికి సుమారు 15 మంది దగ్గర 20 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.
మోసపోయిన నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తీగలాగితే డొంక కదిలినట్టు మోసపోయిన నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. మర్రిగూడ ఎస్ఐ నాగుల్ మీరా నిందితులను నరసరావుపేటలో అరెస్టు చేసి మర్రిగూడ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తున్నట్లు సమాచారం. విచారణలో ఎంత మంది నిరుద్యోగులు మోసపోయారు తెలియాల్సి ఉంది.