కర్రలతో దండలు మార్చుకుని ఒక్కటైన కొత్త జంట.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2021-05-05 09:47:10.0  )
కర్రలతో దండలు మార్చుకుని ఒక్కటైన కొత్త జంట.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : చిన్నప్పుడు అమ్మ, నాన్న దగ్గర మన అల్లరి శృతిమించితే.. లేదంటే స్కూల్‌లో మాస్టారు చెప్పిన హోమ్ వర్క్ చేయకుంటే.. నీకు చింతబరిగెలతో పెళ్లి తప్పదని! హెచ్చరించడం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుత కరోనా టైమ్‌లో చింతబరిగెలతో కాదు కానీ, వెదురు కర్రలతో పెళ్లి జరిగింది. అదెలా అనుకుంటున్నారా? అయితే తెలుసుకోండి..

కొవిడ్ మహమ్మారికి భయపడి ప్రపంచవ్యాప్తంగా జనాలు పెళ్లిల్లు, ఫంక్షన్లతో పాటు ఫ్యూచర్ ప్లాన్లను వాయిదా వేసుకుంటుండగా.. కొందరు మాత్రం తప్పని పరిస్థితుల్లో క్రియేటివ్ పద్ధతుల్లో పనికానిస్తూ మహమ్మారి నుంచి రక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలో ఏడాదికాలంగా జూమ్ వెడ్డింగ్స్‌ నుంచి పీపీఈ కిట్లు ధరించి ఫంక్షన్లు చేసుకోవడం వరకు వివిధ పద్ధతులను చూసే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఓ కొత్త జంట.. తమ వెడ్డింగ్ సెర్మనీలో వరమాలలను వెదురు కర్రలతో మార్చుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కబ్రా.. ‘కరోనా టైమ్స్‌లో ఇండియాలో పెళ్లిళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజర్స్ ఏం చేయాలో చూడండి’ అనే క్యాప్షన్ జతచేశాడు.

ఈ వీడియోలో ఫేస్ మాస్క్ ధరించిన వధూవరులు.. ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ వెదురు కర్రలతో పూలదండలను మార్చుకున్నారు. కాగా ఈ పెళ్లి ఏప్రిల్ 30న బీహార్‌, నార్త్ బెగుసరాయ్ జిల్లాలో జరగగా, ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో వీరి ఐడియాను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం ఈ విపత్కర పరిస్థితుల్లో పెళ్లి పోస్ట్‌పోన్ చేసుకుంటే ఏమయ్యేదని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story