- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం.. తప్పించుకున్న కొడుకు
X
దిశ, పరకాల: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య అనిత(35) మృతి చెందగా భర్త చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం అబ్బు అశోక్ రెడ్డి-అనిత అనే దంపతులు ఓ భూ వివాదం విషయమై మానసిక వేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కుమారుడికి సైతం పురుగుల మందు తాగించే క్రమంలో అతడు తప్పించుకుని, బయటకు వచ్చి అరవడంతో చుట్టుపక్కల వారు వెళ్లి వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిత మృతి చెందగా, అశోక్ రెడ్డి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Advertisement
Next Story