అతిపెద్ద కొవిడ్ ఆస్పత్రి మూసివేత

by Shamantha N |
అతిపెద్ద కొవిడ్ ఆస్పత్రి మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో 10 వేల పడకలతో నిర్మితమైన దేశంలోనే అతిపెద్ద కొవిడ్ కేంద్రాన్ని మూసేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాన్ని కరోనా లక్షణాలు లేనివారు, స్వల్పంగా లక్షణాలను కలిగిన వారికి చికిత్స అందించడానికి ఏర్పాటు చేశారు. తాజాగా స్వల్పంగా లక్షణాలను కలిగిన వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండటానికి కేంద్రం అనుమతులివ్వడంతో ఈ కొవిడ్ కేంద్రంలో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది.

ఈ నేపథ్యంలో దీన్ని ఈ నెల 15వ తేదీ నుంచి మూసేయాలని బెంగళూరు మహానగర పాలిక అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 4న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. మరోవైపు కరోనా కేసుల విజృంభన అధికమవుతున్న ఈ సమయంలో అతిపెద్ద కొవిడ్ కేంద్రంగా ఉన్న దీన్ని మూసేయడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం దీన్ని మూసేయడానికే మొగ్గు చూపుతోంది. అలాగే, ఈ కేంద్రంలో ఉన్న పడకలు, డస్ట్‌బిన్‌లు, ఇతర వస్తువులను ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వసతి గృహాలకు అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed