ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. కరీంనగర్‌పై సర్వత్రా ఉత్కంఠ

by Shyam |
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం.. కరీంనగర్‌పై సర్వత్రా ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓటింగ్ జరుగగా నేడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈ ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరీంనగర్ జిల్లాలోని 2 స్థానాలకు 9 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Advertisement

Next Story