ఫిర్యాదు దారునిపై TRS కౌన్సిలర్ దౌర్జన్యం

by Shyam |
Councilor-Nallabothu-Venkat
X

దిశ, హాలియా: ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమంగా సాగు చేసుకుంటున్నారని ఫిర్యాదు చేసినందుకు అధికార పార్టీ కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య అనుచరులతో కలిసి తనపై దాడికి పాల్పడ్డాడని ఇబ్రహీంపేటకు చెందిన లింగాల ప్రభాకర్ తెలిపారు. బాధితుడు లింగాల ప్రభాకర్ వివరాల ప్రకారం.. ఇబ్రహీంపేట గ్రామంలో 68 సర్వే నెంబర్లో ఉన్న 11.18 ఎకరాల ప్రభుత్వ భూమిని 1వ వార్డు కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నాడని తాను గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రభాకర్ తెలిపారు. దీంతో తనపై కోపం చెంచుకున్న కౌన్సిలర్ శనివారం తన అనుచరులతో కలిసి మా ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని వెల్లడించాడు. కౌన్సిలర్‌తో తనకు ప్రాణహాని ఉందని గత మూడు రోజుల క్రితం హాలియా పోలీసులకు తెలిపినట్లు గుర్తుచేశాడు. రెవెన్యూ అధికారుల, పోలీసుల నిర్లక్ష్యం మూలంగా అధికార పార్టీ కౌన్సిలర్ తనపై దౌర్జన్యానికి ఒడిగట్టినట్లు తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story