- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ విద్యార్థులకు ఫ్రీగా మానసిక వైద్యులు కౌన్సిలింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: తీవ్రమైన ఒత్తిడితో భయాందోళనకు గురవుతున్న ఇంటర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ అందించేందుకు ఇంటర్ బోర్డ్ తగిన ఏర్పాట్లు చేసింది. మానసిక వైద్య నిపుణులచే విద్యార్థులకు తగిన సూచనలు, సలహాలు అందించనున్నారు. దీని కోసం 7 మంది సైకాలజీ డాక్టర్లను నియమించారు. ఫోన్ ద్వారా మానసిక వైద్యులను విద్యార్థులు సంప్రదించవచ్చని బోర్డు అధికారులు తెలిపారు.
పరీక్షల గురించి ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక వైద్యులను సంప్రదించి చికిత్సలు పొందాల్సిందిగా ఇంటర్ బోర్డ్ సూచించింది. ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
సైకాలజీ డాక్టర్ల వివరాలు
1. డా.మజహర్ అలీ సీనియర్ సైకియాట్రిస్ట్- 9154951977
2.డా. రజని క్లినికల్ సైకియాట్రిస్ట్- 9154951695
3.పి.జవహర్ లాల్ నెహ్రు క్లినికల్ సైకియాట్రిస్ట్- 9154951699
4.ఎస్.శ్రీలత క్లినికల్ సైకియాట్రిస్ట్- 9154951703
5.పి. శైలజ క్లినికల్ సైకియాట్రిస్ట్- 9154951706
6.అనుపమ.జి క్లినికల్ సైకియాట్రిస్ట్ -9154951687
7.అనిత అరె క్లినికల్ సైకియాట్రిస్ట్ -9154951704