దిగివస్తున్న పత్తి ధరలు.. ఆందోళనలో రైతులు

by Aamani |   ( Updated:2021-11-13 03:56:40.0  )
patthi-Dharalu-1
X

దిశ, కుబీర్: మూడు రోజులుగా పత్తి ధరలు తగ్గుతుండడంతో పత్తి పంటను నిల్వ చేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్ లో మూడు రోజుల నుంచి పత్తి ధరలు తగ్గుతున్నాయి. క్వింటాల్ కు రూ. 8600 పలికిన పత్తి ధర రూ. 600 తగ్గడంతో ప్రస్తుతం రూ. 8 వేల వరకు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు అధికంగా ఉన్నా స్థానిక వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారు అని రైతులు ఆరోపిస్తున్నారు. కుబీర్ మండలంలో రైతుల వద్ద పత్తి నిల్వలు ఉన్నాయి. ధరలు మరింతగా పెరుగుతాయన్న ఆశతో పత్తిని విక్రయించలేదు. కొన్ని రోజులుగా పత్తి ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ కు తీసుకొచ్చిన పత్తి కంటే రెండింతల పత్తి రైతుల వద్దే ఉంది. ఇంటి స్లాబ్ పైనా గానీ, ఇంటి ముందర రోడ్ల పక్కన గానీ, పంట చేనులలో గానీ పత్తిని నిల్వ ఉంచుకున్నారు. ఇలా చాలా మంది రైతులు ధరలు పెరుగుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. సోయా పంట పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

Advertisement

Next Story

Most Viewed