మంచిర్యాల జిల్లాలో పత్తి రైతు ఆత్మహత్య

by Aamani |

దిశ, ఆదిలాబాద్: ఆరుగాలం కష్టపడి పడించిన పంటకు గిట్టుబాటు ధర లభించకనో లేక దిగుబడి సరిగా రాకనో రైతు చివరికి తన ప్రాణాలను తీసుకుంటున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక, చేసిన అప్పులు తీరక కుటుంబాన్ని ఒంటరి చేసి తను నమ్ముకున్న నేలపైనే తనవు చాలిస్తున్నాడు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో గోమాస రాజం(42) అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈఘటన కాసిపేట మండలం వెంకటాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.

Advertisement

Next Story