- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోజుకు రూ. 1.62కోట్ల సెక్యూరిటీ కవర్
మనదేశంలో ఎస్పీజీ భద్రత ఉన్న ఏకైక వ్యక్తి ప్రధాని మోడీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్పీజీ చట్ట సవరణకు ముందు ప్రధానితోపాటు మరో ముగ్గురు నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా, రాహుల్ గాంధీలకు ఈ భద్రత ఉన్న విషయం తెలిసిందే. చట్ట సవరణతో ఎస్పీజీ భద్రత ప్రస్తుత ప్రధాని, అలాగే మాజీ ప్రధానికి ఐదేళ్ల పాటు ఉంటుంది. కానీ, 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీ రెండోసారీ కొనసాగుతున్నారు. దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు(ఐదేళ్లుదాటింది కాబట్టి) ఈ భద్రత లేకుండాపోయింది. ఒక్కరికే భద్రత కల్పిస్తున్న ఎస్పీజీకి ఈ సారి బడ్జెట్‌లో 10 శాతం అధికంగా కేటాయింపులు జరిగాయి. 2019-20 బడ్జెట్‌లో ఎస్పీజీకి రూ. 540 కోట్లు కేటాయించగా.. ఈ సారి (2020-21)బడ్జెట్‌లో రూ. 592.55 కేటాయించారు. అంటే రోజుకు ప్రధానికి సుమారు రూ. 1.62 కోట్ల విలువైన ఎస్పీజీ సెక్యూరిటీ భద్రతనిస్తున్నదని అర్థమవుతున్నది.