- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెరుగుతున్న ఇళ్ల ధరలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా కోలుకుంటోంది. అయితే, ఈ పరిణామాలు సొంత ఇంటి కోసం కలగంటున్న సామాన్యులకు భారంగా మారనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్ల విక్రయాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ధరలను పెంచక తప్పట్లేదని రియల్టర్లు చెబుతున్నారు. పైగా, అనూహ్యంగా సిమెంట్, స్టీల్ ధరలు పెరగడం, ఎలక్ట్రికల్ విడిభాగాల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. అదే సమయంలో నిర్మాణ రంగంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో సొంత ఊర్లకు వెళ్లిపోవడంతో ప్రాజెక్ట్లు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు ఆర్థిక భారం పెరిగిపోతోంది.
ఈ కారణాలతో రియల్ ఎస్టేట్ రంగం ధరలను పెంచుతున్నారు. నేషనల్ అసోసియేషన ఆఫ్ రియల్టర్స్ ఇండియా తాజా నివేదిక ప్రకారం.. ఇండిపెండెంట్ ఇళ్లకు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు 10-15 శాతం ధరలను అమ్మాల్సిన పరిస్థితి ఉందని వెల్లడించింది. నిర్మాణ రంగానికి సంబంధించి పరిశ్రమల్లో ఉత్పత్తి క్షీణించడం, అదనపు భారం పెరగడంతో అన్ని పరిశ్రమలు ధరలను పెంచేశాయి. రియల్టర్లు కొనుగోలు చేయాల్సిన నిర్మాణ సామాగ్రిపై పెరిగిన ధరలను భరించే పరిస్థితిలో లేరు. దీనివల్లే కొనుగోలుదారులపై భారాన్ని వేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రభావం నుంచి కోలుకునే క్రమంలో రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు భారం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.