- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ శాఖలో వసూల్ రాజాలు
దిశ, ఖమ్మం టౌన్: విద్యుత్‌శాఖలో ప్రతినెలా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా.. లంచాలు లేకుండా కొంతమంది అధికారులు ఏ పనీ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్, వైరా, మధిర, సత్తుల్లి సబ్ డివిజన్‌లో వినియోగాదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఖమ్మం, ఖమ్మం రూరల్ శివారు ప్రాంతాల్లో కొత్తలైన్లు వేయడంతో పాటు వందల సంఖ్యలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తెస్తున్నారు.
కొత్త కనెక్షన్ల మంజూరు మొదలు, అపార్ట్‌మెంట్లకు ప్యానల్ బోర్డుల కేటాయింపుల వరకు ఏ పని చేయాలన్నా వినియోగదారుల నుంచి అందినకాడికి దండుకుంటూ కొంతమంది ఉద్యోగులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అపార్ట్‌మెంట్ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే ఒక రేట్, త్రీ ఫేజ్ కనెక్షన్ తీసుకునేందుకు మరో రేట్, మీటర్ చేంజ్ చేసుకోవాలన్నా ఇంకో రేట్.. ఇలా ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్‌చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం రూరల్, కొత్తలింగాల, ప్రాంతాలల్లో కొత్తగా వచ్చిన వెంచర్లలో ఏడీఈ నుంచి ఏఈ వరకు అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని విద్యుత్ శాఖలో అక్రమాలకు పాల్పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నా ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలువస్తున్నాయి.
అడిగినంత ఇస్తే ఒకలా.. లేదంటే మరోలా..
విద్యుత్‌శాఖ కొత్తలైన్, కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వేయాలన్నా ప్రతి పనికి ముందుగా అధికారులు ఎస్టిమేషన్లు వేయాలి. ఈ ఎస్టిమేషన్ల ఆధారంగా వినియోగదారులు విద్యుత్ సంస్థకు డబ్బులు చెల్లించి పనులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్టిమేషన్లు వేసేటప్పుడే కొంత మంది అధికారులు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఎస్టిమేషన్లు వేసే ముందు అడిగినంత చెల్లిస్తే ఒకలా, డబ్బులివ్వకపోతే మరోలా రూపొందిస్తూ సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు
అన్నింటా అక్రమాలే..
షాపింగ్ కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు లోడ్ ఆధారంగా ప్రత్యేకంగా డిస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్)లు ఏర్పాటు చేయాలి. అయితే పలు ప్రాంతాల్లో కొంత మంది అధికారులు డిస్కంకు చెందిన సొమ్ముతో ఇష్టానుసారంగా ట్రాన్స్‌ఫార్మర్లు పెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఖమ్మం శివారు ప్రాంతాల్లో కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు కొంతమంది వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేస్తున్నా అధికారులను కలిసి ఎంతో కొంత ఇచ్చే వరకు మీటర్లు స్టోర్ నుంచి బయటకు రావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
భవనాలు, అపార్ట్‌మెంట్లకు 4 మీటర్లు దాటితే ప్యానల్ బోర్డు తప్పక ఏర్పాటు చేసుకోవాలి. ప్యానల్ బోర్డుకు రూ.25 వేల నుంచి 30 వేల వరకు ఖర్చు అవుతుంది. ఇలా చేయకపోయినా రూ.10 నుంచి 15 వేలు చెల్లిస్తే చాలు పలు ప్రాంతాల్లో ప్యానల్ బోర్డు లేకుండానే అదనంగా ఒకటి, రెండు మీటర్లు కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏఈ నుంచి మొదలు ఏడీఈ, డీఈ, టెక్నికల్ ఏఈ ఇలా ప్రతి ఒక్క అధికారికి ఎంతో కొంత ఇస్తే కాని పనులు జరగడం లేదు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వకపోతే ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది అధికారులు కమర్షియల్ కేటగిరిలో ఉన్న కనెక్షన్‌ను డొమిస్టిక్ కేటగిరిలోకి మార్చుతూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు.