‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’.. కార్పొరేటర్‌‌ను బాధ పెట్టిన మున్సిపల్ ఆఫీసర్..?

by Sridhar Babu |
‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’.. కార్పొరేటర్‌‌ను బాధ పెట్టిన మున్సిపల్ ఆఫీసర్..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ బల్దియా ఆఫీసర్‌కు అధికార పార్టీ కార్పొరేటర్‌కు మధ్య జరిగిన వాగ్వాదం నగరంలో చర్చనీయాంశంగా మారింది. తనపై సదరు అధికారి ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’ అన్నారని కార్పొరేటర్ కినుక వహించారు. ఈ విషయం స్థానిక మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం.

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ నగరంలోని ఓ డివిజన్‌లో డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఆ తరువాత తాము వెళ్లిపోతున్నామని స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వగా.. ఇందుకు స్పందించిన సదరు కార్పొరేటర్ నగరంలోని వరద నీరు ఎక్కువగా తన డివిజన్ మీదుగానే వెళ్తున్నది.. బాస్‌కు చెప్తాను.. కొంచెం సేపు ఆగాలని రెస్క్యూ టీంను కోరినట్టు తెలుస్తోంది. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి రెస్క్యూ టీంను అక్కడే ఉండేందుకు సూచనలు ఇవ్వాలని కోరినప్పటికీ, సిబ్బంది అప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్పొరేటర్ కినుక వహించారు. ఈ వ్యవహారంపై బల్దియా అధికారితో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కార్పొరేటర్లకు విలువ లేకుంటే ఎలా అని అడిగినట్టుగా తెలిసింది. ఈ క్రమంలోనే సదరు అధికారి వాటీజ్ దిస్ నాన్సెన్స్ అంటూ వ్యాఖ్యానించడంతో ప్రశ్నించిన కార్పొరేటర్ బాధ పడ్డట్టుగా సమాచారం. ఏది ఏమైనా మున్సిపల్ అధికారి ఈ విధంగా మాట్లాడం ఏంటని కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story