పుస్తకాల పేరుతో కార్పొరేట్ స్కూల్‌ యాజమాన్యం దోపిడీ

by Sridhar Babu |
పుస్తకాల పేరుతో కార్పొరేట్ స్కూల్‌ యాజమాన్యం దోపిడీ
X

దిశ, గోదావరిఖని: ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం.. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పుస్తకాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఓ కార్పొరేట్ పాఠశాల.. స్థానికంగా ఇల్లును అద్దెకు తీసుకొని మరీ పుస్తకాలను నిల్వచేశారు. ఎటువంటి అనుమతి లేకుండా ఆ పుస్తకాలను విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అధిక ధరలకు పుస్తకాలను అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని.. ప్రైవేట్ పాఠశాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఇప్పటివరకు సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story