కరోనా నివారణకు మేము సైతం..

by sudharani |
కరోనా నివారణకు మేము సైతం..
X

హైదరాబాద్: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి మేము సైతం అంటూ కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుకు వచ్చాయి. రాష్ట్ర యంత్రాంగానికి తమవంతు సాయం అందించడానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా యశోద హాస్పిటల్స్ ఎండీ జి.ఎస్ రావు.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్ తరఫున 2లక్షల మాస్క్‌లు అందజేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 1.20లక్షల మాస్క్‌లు కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ ఆఫీస్‌కు అందించామని తెలిపారు. రేపటిలోగా మరో 80వేల మాస్కులు అందజేస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్, మలక్‌పేట్, సోమాజిగూడలోని యశోద ఆస్పత్రుల్లో 60 ప్రత్యేక వార్డులను కరోనా చికిత్సకోసం వినియోగిస్తామని తెలిపారు. కరోనా నివారణకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతమని ప్రశంసించారు.

tags: corporate, hospitals, carona virus, spread, covid-19, etala rajendhar, yashoda hospitals, md gs rao, masks

Advertisement

Next Story