- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. 23 కిలోల బరువు తగ్గిన మైక్
దిశ, వెబ్ డెస్క్ :
రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ ప్రభావం ఉండదని, యువకులకు వచ్చినా ఏం కాదనే భ్రమలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లకు కరోనా వల్ల తన శరీరం ఎంతగా ఎఫెక్ట్ అయ్యిందో.. కాలిఫోర్నియాకు చెందిన మైక్ అనే వ్యక్తి జీవితమే ఉదాహరణ.
కాలిఫోర్నియాకు చెందిన మైక్ షుల్టజ్ అనే వ్యక్తి హెల్తీ మ్యాన్. ఫిట్ నెస్ ఫ్రీకర్. అయితే ఇదంతా కరోనా కు ముందు.. కరోనా రావడంతో తన ఫిట్ నెస్ అంతా పోయింది. కరోనా వచ్చిన తర్వాత అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. మైక్ కు మార్చిలో కరోనా వైరస్ అటాక్ అయ్యింది. కరోనా నుంచి కోలుకోవడానికి అతడికి 6 వారాలు పట్టింది. శ్వాస తీసుకోవడానికే 4 వారాల సమయం పట్టింది. కరోనా ఎఫెక్ట్‌తో 23 కిలోల బరువు తగ్గినట్లు మైక్ వెల్లడించాడు. కరోనాకు ముందు మైక్ బరువు 86 కిలోలు ఉండగా, ఇప్పుడు 63కేజీలు ఉన్నాడు. కరోనా ఎలాంటి వారిపైన అయినా ప్రభావాన్ని చూపిస్తుందని, దానికి వయసుతో సంబంధం లేదని పేర్కొన్నాడు. మీరు హెల్తీగా ఉన్నప్పటికీ కరోనా ఎఫెక్ట్ చూపిస్తుందన్నాడు. కరోనా రాక ముందు వరకు రోజూ జిమ్‌లో వర్కవుట్లు చేసేవాడినని అన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికి వైరస్ సోకిందని మైక్ వివరించాడు. కరోనాకు ముందు తీసుకున్నప్పటి ఫొటోతోపాటు, కరోనా సోకినప్పుడు హాస్పిటల్ లో తీసుకున్న ఫొటోను మైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో చూస్తేనే.. కరోనా ఎంత ఆరోగ్యవంతుడినైనా ఎఫెక్ట్ చేస్తోందని చెప్పొచ్చు.