- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెళ్లొచ్చింది ఇద్దరే.. కరోనా కేసులు 36
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ 500 కేసులకు తక్కువ కాకుండా నమోదవుతూ ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు 109 కేసులు నమోదైతే, నిన్న 117 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క సామర్లకోట మండలంలోనే 42 కేసులు నమోదయ్యాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇందులో 36 కేసులు ఒక్క అమ్మణ్ణమ్మ కాలనీకి చెందినవంటే మరింత ఆశ్చర్యపోక తప్పదు. ఈ కేసులన్నీ ఇద్దరు మహిళల ద్వారా వ్యాపించడం గమనార్హం.
ఈ నెల 17న అమ్మణ్ణమ్మ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలు హైదరాబాదు వెళ్లి వచ్చారు. వచ్చిన అనంతరం ఇరుగ్గా ఉండే కాలనీలో కలియతిరిగారు. వీరిద్దరికీ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో కాలనీ వాసులకు పరీక్షలు చేయగా నిన్న ఫలితాలు వచ్చాయి. దీంతో ఏకంగా 36 మంది బాధితులు తేలారు. దీంతో కాలనీ మొత్తాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు.