- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రపతి భవన్‌లో కరోనా కలకలం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో కరోనా కలకలం సృష్టించింది. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లో ఉంటున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో 125 సిబ్బంది క్వార్టర్‌లను అధికారులు సీల్ చేశారు. అలాగే, ఆ మహిళ సహా ఆమె బంధువులను స్వచ్ఛంద ఐసొలేషన్‌లకు తరలించారు. రాష్ట్రపతి భవన్‌లో పారిశుధ్య కార్మికురాలి కోడలుకు వైరస్ పాజిటివ్ తేలింది. కోడలు తల్లి వారం క్రితం కరోనావైరస్‌తో మరణించింది. ఆమె కరోనా పేషెంట్‌ను పరామర్శించేందుకు వెళ్లిన విషయం అధికారులు దృష్టికి రాగానే.. ఆ పారిశుధ్య కార్మికురాలి కుటుంబీకులందరినీ ఐసొలేషన్‌కు తరలించారు. వారందరికీ పరీక్షలు చేయగా.. పారిశుధ్య కార్మికురాలి కోడలుకు మాత్రమే పాజిటివ్ తేలింది. దీంతో సిబ్బంది ఇళ్లనూ సీల్ చేసినట్టు ఓ అధికారి వివరించారు. ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసి బ్లీచింగ్ చల్లినట్టు తెలిపారు.
Tags: rastrapathi bhavan, coronavirus, seal, positive, isolation, daughter in law