కరోనా పేషెంట్ మృతి.. రోడ్డు మీదే వదిలేసిన వైద్యసిబ్బంది

by Shamantha N |
కరోనా పేషెంట్ మృతి.. రోడ్డు మీదే వదిలేసిన వైద్యసిబ్బంది
X

దిశ, భోపాల్: కరోనా వైరస్ సోకిన వారి పట్ల వైద్య సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఈ సంఘటనను చూస్తే కన్నీరు పెట్టిస్తోంది. కేవలం ట్రాఫ్రిక్ సమస్య ఉందన్న సాకుతో ప్రాణాపాయస్థితిలో ఉన్న పేషెంట్ ను హాస్పిటల్ కు తరలించకుండా ఫుట్ పాత్ పై వదిలేసి మానవత్వానికే మచ్చ తెచ్చారు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో జరిగింది. ఇక్కడ కరోనా పేషెంట్లతో వైద్యసిబ్బంది వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్నది. భోపాల్‌లోని ఓ ఆస్పత్రి ముందే పేవ్‌మెంట్ ముందు పేషెంట్ బాడీని వదిలేసినట్టు చూపిస్తున్న సీసీటీవీ ఫుటేజీ కలకలం రేపుతున్నది. రెండు హాస్పిటళ్ల మధ్య సాగిన ప్రయాణాల్లోనే పేషెంట్ ప్రాణం కోల్పోయాడు.

పవర్ డిస్కం కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగి కిడ్నీ సమస్యలతో రెండు వారాల క్రితం ఆస్పత్రిలో చేరాడు. సోమావారం కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయింది. కొవిడ్ 19 నిర్ధారణ తర్వాత భోపాల్‌లోని పీపుల్స్ ఆస్పత్రి నుంచి కరోనాకు నోడల్ సెంటర్‌గా ఉన్న చిరయూ హాస్పిటల్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. చిరయూ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రాగా, అందులో పేషెంట్‌ను పంపించారు. అయితే, అంబులెన్స్ ఆ పేషెంట్‌ను మళ్లీ వెనక్కి తెచ్చింది. అప్పటికే మరణించిన ఆ పేషెంట్ మృతదేహాన్ని పీపుల్స్ హాస్పిటల్ ముందు పేవ్‌మెంట్‌పై వదిలేశారు.

చిరయూ ఆస్పత్రికి పంపితే మళ్లీ ఎందుకు రిటర్న్ పంపిందని పీపుల్స్ హాస్పిటల్ సిబ్బంది ప్రశ్నించగా, అంబులెన్స్‌లోనే పేషెంట్ ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండటంతో ట్రాఫిక్ దృష్ట్యా వెనక్కి తీసుకెళ్లటానికి అనుమతినిచ్చామని చిరయూ ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. రెండు ఆస్పత్రులు చేసిన తప్పిదం వల్లే తన తండ్రి చనిపోయాడని పేషెంట్ కొడుకు వాపోయాడు.

Advertisement

Next Story

Most Viewed