- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియామకాల్లేని ఏప్రిల్ నెల!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి ఉద్యోగులపైనే కాకుండా, ఉద్యోగాలను వెతుక్కునే వారిపై కూడా భారీగా ప్రభావం చూపించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలో జరగాల్సిన నియామకాలు ఏకంగా 62 శాతం తగ్గాయని నౌకరీ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నౌకరీ డాట్ కామ్ సైట్‌లో నమోదైన ఉద్యోగాల సంఖ్యలను అనుసరించి నియామకాలను లెక్కించి నౌకరీ జాబ్ స్పీక్ గణాంకాలను చేస్తుంది. ఈ పరిశీలన ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో మొత్తం 2,477 నియామకాలు జరగ్గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కేవలం 951కి పడిపోయినట్టు వెల్లడించింది.
హోటల్, రెస్టారెంట్లు…
నౌకరీ డాట్ కామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏ ఏ రంగాల్లో ఎంతటి క్షీణత ఉందో పరిశీలిస్తే…హోటల్, రెస్టారెంట్, విమానయాన, రవాణా రంగాల్లో 91 శాతం తక్కువ నియామకాలు జరగ్గా, వాహనం, దాని అనుబంధ రంగాల్లో 82 శాతం, రిటైల్ రంగంలో 77 శాతం, ఫైనాన్స్,అకౌంటింగ్‌లో 70 శాతం, పర్యాటక, టికెటింగ్, విమానయాన రంగాల్లో కొత్త నియామకాలు 95 శాతం తగ్గిపోయినట్టు నివేదిక స్పష్టం చేసింది. రెస్టారెంట్, హోటళ్లలో మాత్రమే 78 శాతం తగ్గాయి.
ఫార్మాలోనూ…
ముఖ్యంగా రెస్టారెంట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, ఎయిర్‌లైన్స్ రంగాల్లో నియామకాలు భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. బయోటెక్, ఇన్సురెన్స్, ఐటీ రంగం, ఫార్మా రంగాల్లోని నియామకాలకూ కరోనా కాటు తప్పలేదు. కరోనా కోరలు ఉద్యోగ నియామకాలపై అత్యధికంగా ఉందని, ఒక నెలలో 62 శాతం తగ్గడం ఆందోళనకరమని నౌకరీ డాట్ కామ్‌కు చెందిన పవన్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో 51 శాతం నియామకాలు నిలిచిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కొనుగోళ్లు, సరఫరాల్లో 70 శాతం నియామకాలు ఆగిపోయాయి. మార్కెటింగ్, ప్రకటనల్లో 69 శాతం, విక్రయాలు, వ్యాపారాభివృద్ధి విభాగంలో 69 శాతం, అకౌంటింగ్, ఫైనాన్స్‌లో 68 శాతం, ఐటీ-సాఫ్ట్‌వేర్‌లో 51 శాతం, బీపీవోలో 54 శాతం, బయోటెక్, ఫార్మా, హెల్త్ కేర్ రంగంలో 57 శాతం, ఎడ్యుకేషన్ రంగంలో 56 శాతం తగ్గిపోయినట్టు గణాంకాలు నమోదయ్యాయి.
పనిచేయని అనుభవం…
ముఖ్యంగా కరోనా వ్యాప్తితో మెట్రో నగరాల్లో ఉద్యోగ అవకాశాలకు పెద్ద మొత్తంలో గండి పడింది. ఢిల్లీలో 70 శాతం, కోల్‌కతాలో 60 శాతం, చెన్నైలో 62 శాతం, ముంబైలో 60 శాతం పడిపోయినట్టు నౌకరీ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. ఈ ప్రభావం కొత్త నియామకాలే కాకుండా అనుభవం ఉన్న వారందరిపైనా అధికంగా ఉందని, అనుభవం రీత్యా చూస్తే..8 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న వారిలో 55 శాతం, 13 నుంచి 16 ఏళ్ల అనుభవం ఉన్న వారిలో 53 శాతం, లీడర్‌షిప్ విభాగంలో 16 ఏళ్లకు పైన అనుభవం ఉన్న వారిలో 50 శాతం తగ్గినట్టు తెలుస్తోంది.
Tags: Coronavirus, Coronavirus Pandemic, COVID-19, Hiring, Jobs, Lockdown, Naukri.Com