- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్.. ఇంట్లో ఇలా చేయొచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్-19 ఎఫెక్ట్ నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా అన్నీ ఫ్యామిలీలు ఇళ్లకే పరిమతం అయ్యాయి. గడప దాటి కాలు బయటపెట్టే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఎంతమంది మెంబర్స్ ఉన్నా ఇంట్లోనే మసులుకుంటున్నారు. అయితే ఇలాంటి సిచ్వేషన్‌లో కుటుంబసభ్యుల మధ్య చిన్న కారణాలకే ప్రస్టేషన్ వచ్చి గొడవలయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇంటి పెద్దలు, తల్లిదండ్రులు, పిల్లలు చాలా ఓపిగ్గా ఉండి అందరి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొద్దున నిద్రలేచినప్పటి నుంచి మళ్లీ పడుకునే వరకు చూసిన ముఖాలనే చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే, ఒంటరితనానికి అలవాటు ఉన్న కొందరికి సడన్‌గా ఈ లాక్‌డౌన్ పరిస్థితులు రావడంతో కాళ్లు, చేతులు కట్టేసినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వారంతా ఏం చేయాలి ! ఏం చేయకుంటే మైండ్ పీస్‌పుల్‌గా ఉంటుందో చూద్దాం…
చేయాల్సినవి…
1.లాక్‌డౌన్‌తో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లే వెసులుబాటు లేనందున ఇంట్లోనే ఉన్న చెట్లకు తోటం పెట్టడం లాంటివి చేయాలి, మిగతా చెట్ల కింద ఆకులు రాలితే ఏరివేస్తూ చెట్లను నీరు పోస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వాకింగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
2. అమ్మ వంట చేస్తుంటే హెల్ప్ చేస్తుండాలి. ఉల్లిపాయలు, కూరగాయలు తరిగితే అమ్మకు రిలీఫ్ ఇచ్చిన వాళ్లమవుతాం. దీంతో అమ్మకు కొద్దిపాటి శారీరక శ్రమ తప్పుతుంది.
3. మార్నింగ్ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి టిఫిన్ చేసేలా ప్లాన్ చేయాలి. ఇలా చేయడం వలన అమ్మకు రిస్క్ తప్పుతుంది.
4. టిఫిన్ చేశాక అందరూ కలిసి మాట్లాడుకోవాలి. కబుర్లు చెప్పుకోవాలి. తర్వాత లంచ్ ఏం చేస్తే బాగుంటుందని అమ్మకు చెబితే ప్రిపేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే అందరూ ఓ అభిప్రాయానికి వస్తారు కాబట్టి కూరలు విషయంలో గొడవలు రాకుండా ఉంటాయి.
5. ఇంట్లో స్కూల్ పిల్లలు ఉంటే నాలెడ్జ్, జోకులకు సంబంధించిన పుస్తకాలు ఇవ్వాలి. వాటితోపాటు మ్యాథ్స్ లాజికల్ టిప్స్ చెబుతూ ఉండాలి
6. ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులు క్లోజ్‌గా మూవ్ అవ్వాలి. కరోనా వైరస్‌పై అర్థం అయ్యేలా వివరించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చూడాలి
7. పిల్లలు ఆడుకుంటూ మట్టి ముట్టుకుంటారు కాబట్టి వారిని శుభ్రంగా ఉంచాలంటూ చేతులు క్లీన్‌గా ఉంచుకోవాలని చెప్పాలి. ఈ సమయంలో పిల్లలపై కోపం చేయొద్దు.
8. ఖాళీ సమయాల్లో పిల్లలను కూర్చోబెట్టి దేశం, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలు వివరించాలి. కొన్ని విషయాలు నేర్పించాలి
9. నవలలు, కవితలకు సంబంధించిన బుక్స్ చదవమని చెప్పాలి. బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దు
10. టైమింగ్స్ ప్రకారం భోజనం చేయాలి. రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి, ఇల్లును క్లీన్‌గా ఉంచుకోవాలి.
11. పిల్లలకు క్యారమ్, చెస్ లాంటి ఆటలు నేర్పిస్తూ ఉండాలి.
12. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీలైనంత ఎక్కువగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలి. ఎవరి బెడ్‌లలో వారే నిద్రపోతే మంచిది.
13. ఎవరైనా ఇతర దేశాల నుంచి హోం క్వారంటైన్ పాటించకుండా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
చేయకూడనివి..
1. ఎలాగూ డ్యూటీలు, కాలేజీలు లేవని మిడ్‌నైట్ దాక మేల్కొవడం, మార్నింగ్ లేటుగా లేవడం లాంటివి చేయొద్దు.
2. ఎక్కడి కరోనా వచ్చిందిరా దేవుడా అని ప్రతిసారి తలచుకుంటూ బాధపడొద్దు.
3. ఇంట్లో ఉంటే బోరు కొడుతుందని కొంతమంది యువకులు సాయంత్రం పూట ఇంటి ముందు క్రికెట్ ఆడటం లాంటివి చేస్తున్నారు. ఇలా అస్సలు చేయొద్దు.
4. కొన్ని ప్రాంతాల్లో పక్కింటివాళ్లను ఇంటి పిలుచుకొని మాట్లాడుతూ కాఫీలు, టీలు, టిఫిన్‌లు చేస్తున్నారు. దయచేసి ఎవరినీ ఇంటికి పిలవొద్దు
5. గ్రామీణ ప్రాంతాల్లో తమ గ్రామంలోకి ఎవరూ రావొద్దని రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికివేస్తున్నారు. అలా చేయొద్దు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లకు ఇబ్బంది అవుతుంది.
6. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిన యువకులు కొందరు ఇంట్లో నెట్ రావడం లేదని రోడ్లపైకి వెళ్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి
7. సూపర్ మార్కెట్లు, మంచినీటి ప్లాంట్ల దగ్గర గుంపులుగా ఉండొద్దు.
8. ప్రతిసారి వీడియో కాలింగ్, ఫోన్లు చేస్తూ ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు.
Tags : corona virus, instructions, Do Not, family members, Hyderabad, village, books, novels, carrom, chess