- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్ పాటిస్తున్న విమానాలు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. గత రెండు వారాలుగా విమానాలన్ని లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. విమానాశ్రయాల్లోని పార్కింగ్ స్థలాన్ని దాటి విమానాలు బయటకు రావడం మానేశాయి. ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లోని విమానాలను చూసొద్దాం పదండి!
గత నెల 25 నుంచి అమెరికాలోని అలబామాలోని బర్మింగ్‌హామ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా వైరస్ వ్యాధి కారణంగా నిలిచిపోయిన డెల్టా అయిర్‌లైన్స్ విమానాలివి.
కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 14న బ్రిటన్‌లోని హెత్‌రో విమానాశ్రయంలోని టెర్మినల్ 5లో ఉన్న రన్‌వేపై పార్కింగ్ చేయబడ్డ బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమనాలు.
మార్చి 16న కరోనా మహమ్మారి విజృంభనను నిలువరించేందుకు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఉన్న లుఫ్తాన్స విమానాశ్రయంలో సేద తీరుతున్న విమానాలు.
ఆస్ట్రియా దేశం కరోనాను ఎదుర్కొనేందుకు తొందరగానే మేల్కొన్న తర్వాత ఫిబ్రవరి 6 నుంచి ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ క్యారియర్ విమానాలు ఇలా పార్కింగ్‌లో నిలిచిపోయాయి.
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా వ్యాప్తి కారణంగా విదేశీ విమాన ప్రయాణాలు నిలిపేయడంతో మార్చి 24 నుంచి ఖాళీగా ఉన్న కొరియన్ ఎయిర్‌లైన్స్ విమానాలు.
కరోనా వ్యాప్తి విస్తరించకుండా విమాన ప్రయాణాలపై ఆంక్షలు అమలైన తర్వాత మార్చి 24 నుంచి చిలీలోని శాంటియాగో ఆర్టురో మెరినొ బినిటెజ్ విమానాశ్రయంలో రన్‌వేపై పార్కింగ్ చేయబడ్డ ప్యాసింజర్ విమానాలు.
Tags: Delta Air, British Airways, Lufthansa, Germany, Austrian Airlines, Austria, Korean Air