ఇటలీలోని ఆ గ్రామంలో అడుగుపెట్టని ‘కరోనా’

by Sujitha Rachapalli |
ఇటలీలోని ఆ గ్రామంలో అడుగుపెట్టని ‘కరోనా’
X

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ కారణంగా.. విలవిల్లాడుతున్న మొదటి దేశం.. ఇటలీ. ఆ మహమ్మారి కారణంగా ఇప్పటికే ఇటలీలో.. 1, 15, 242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 13, 915 మంది కరోనా కాటుకు బలయ్యారు. కరోనా కారణంగా ప్రపంచంలో అత్యధికంగా ప్రాణాలు కోల్పోయింది ఇటలీలోనే. మరో 4 వేల మందికి పైగా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఇటలీలో .. ఓ గ్రామం మాత్రం సంతోషమైన జీవనాన్ని ఆస్వాదిస్తుంది. కరోనా తమ గడపల్లో ఇంతవరకు అడుగుపెట్టకపోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు.

ప్రపంచంలో ఇప్పటివరకు మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అధికశాతం మరణాలు ఇటలీలో సంభవించాయి. ఇటలీలో వేల మంది చనిపోయారు.. మరెంతో మంది ఆపదలో ఉన్నారు. దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా.. మరణాలు ఆగడం లేదు. కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇటలీలోని ఓ గ్రామం మాత్రం రెగ్యులర్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. కరోనా వైరస్ ప్రభావం ఆ గ్రామంలో ఏమాత్రం లేకపోవడమే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఇటలీకి తూర్పు ప్రాంతమైన టురిన్ నగరానికి సమీపంలోని ఉన్న ఈ గ్రామంపేరు ‘మోంటాల్డో టోరినిస్’. ఇక్కడున్న మ్యాజికల్ వాటర్ వల్ల కరోనా వైరస్ ఇక్కడికి ప్రవేశించలేదని స్థానికులు నమ్ముతారు. ఈ నీరు నెపోలియన్ బోనపార్టీ సైనికులకు సోకిన న్యుమోనియాను నయం చేసిందని ఇక్కడివారు చెబుతుంటారు. ‘మోంటాల్డో టోరినిస్’ గ్రామం టురిన్ కు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. 720 మంది జనాభా ఉన్న మోంటాల్డో టోరినిస్ గ్రామంలోని స్వచ్ఛమైన గాలి, బావి నీరు అనారోగ్యాలను నివారిస్తాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు.

ఇప్పుడు ఆ నీరు తాగడం లేదు:

టోరినిస్ గ్రామంలోని బావి నీళ్లే.. కరోనా రాకుండా కాపాడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఆ బావి నీళ్లు తాగితే ఎన్నో వ్యాధులు నయమవుతాయని వారి విశ్వాసం. ఒకప్పుడు ఆ బావి నీళ్లే తాగినా.. ఇప్పుడు వ్యవసాయానికి మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్ రానప్పటికీ.. ఇటలీలో పరిస్థితి దారుణంగా ఉండటంతో.. టోరినిస్ ప్రజలంతా బయటకు వెళితే మాస్క్ లు కట్టుకుంటున్నారు. గ్రామంలోని అధికారులు ఎప్పటికప్పుడు కరోనా సమాచారాన్ని, ఆ మహమ్మారి రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Tags : coronavirus, italy, montaldo torinese, no entry, not affected

Advertisement

Next Story

Most Viewed